Monday, 18 August 2014

Tdp Minister Achhennayudu Comments Ys Jagan Killed Paritala Ravi



Tdp minister achhennayudu comments ys jagan killed paritala ravi

టీడీపీ నేత పరిటాల రవిని హత్యకు వైఎస్ జగన్ కారణమో లేదో తెలియదు కానీ... టీడీపీ మంత్రి అయిన అచ్చెన్నాయుడు మాత్రం ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారు. పరిటాల రవిని చంపింది వైఎస్ జగన్ కాదా? అంటూ ఆయన నిలదీశారు. అసెంబ్లీలో శాంతిభ్రదల తీర్మానంపై చర్చ జరపాలని పట్టుబడిన వైకాపా సభ్యులు... తమ పార్టీలో వున్న నేతల హత్యలకు టీడీపీ పార్టీయే కారణమంటూ విమర్శలు లేవనెత్తిన సందర్భంలో అచ్చెన్నాయుడు మండిపడుతూ అలా ఆరోపించారు.......Read More......



Jagan Says He Dont Have One Lakh Crore Money


Jagan says he dont have one lakh crore money

లక్షకోట్ల అవినీతి. ఈ మాట వినగానే ఎవరికైనా ఠక్కున గుర్తుకు వచ్చేది వైఎస్ జగన్ పేరు. ఆయన అవినీతి, అక్రమాల ఆరోపణలు ఎంతవరకు నిజమన్నది సీబీఐకి, పైవాడికి తెలియాలి. తండ్రి హయాంలో బ్యాక్ డోర్ పనులు, క్విడ్ ప్రో కో ద్వారా జగన్ లక్ష కోట్లను అక్రమంగా కూడబెట్టాడని తీవ్ర ఆరోపణలున్నాయి. ఇదే కేసులో జగన్ అరెస్టయి ఏడాదికంటే ఎక్కవే జైలు జీవితం గడిపి ఎన్నికల ముందు విడుదలయ్యారు. ఇప్పుడిదే అంశం మళ్ళి తెరపైకి వచ్చింది. అటుపోయి ఇటు పోయి తనకే తగిలినట్లుగా.., అన్నిటిపై విమర్శలు వచ్చి చివరకు లక్ష కోట్ల వ్యవహారం దగ్గర నిలిచింది. దీంతో జగన్ కు కోపం వచ్చింది. అసలు ఎక్కడున్నాయి లక్ష కోట్లు అని ఎదురు ప్రశ్నించారు. Read More......

Kcr Briefs About Meeting With Chandrababu Naidu

 
కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్
 
Kcr briefs about meeting with chandrababu naidu 
 
ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది. దాదాపు గంటన్నర పాటు తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు ముఖా ముఖీ నిర్వహించుకున్నారు. విభజన సమస్యలను కలిసి పంచుకున్నారు. సమావేశం ఎలా జరిగిందో తెలియదు కానీ.., ఫలప్రదంగా ఉందని తెలంగాణ సీఎం ప్రకటించారు. తెలుగు రాష్ర్టాల కోసం కేంద్రం అసలు ఏ కమిటి నియమించనవసరం లేదన్నారాయన. మనది మనమే పరిష్కరించుకుందాం అని చెప్పారు. చర్చల ద్వారా సమస్యలు పరష్కరించుకుంటే అభ్యంతరమే లేదని విభజన చట్టంలో ఉందని గుర్తు చేశారు. కాబట్టి ప్రతి సమస్యను చర్చించుకుని పరిష్కరించుకుంటామన్నారు. తెలుగు రాష్ర్టాలు బాగుండాలన్నదే తన ధ్యేయంగా కేసీఆర్ స్పష్టం చేశారు.
 
Click Here for more Latest Telugu News 
ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది. దాదాపు గంటన్నర పాటు తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు ముఖా ముఖీ నిర్వహించుకున్నారు. విభజన సమస్యలను కలిసి పంచుకున్నారు. సమావేశం ఎలా జరిగిందో తెలియదు కానీ.., ఫలప్రదంగా ఉందని తెలంగాణ సీఎం ప్రకటించారు. తెలుగు రాష్ర్టాల కోసం కేంద్రం అసలు ఏ కమిటి నియమించనవసరం లేదన్నారాయన. మనది మనమే పరిష్కరించుకుందాం అని చెప్పారు. చర్చల ద్వారా సమస్యలు పరష్కరించుకుంటే అభ్యంతరమే లేదని విభజన చట్టంలో ఉందని గుర్తు చేశారు. కాబట్టి ప్రతి సమస్యను చర్చించుకుని పరిష్కరించుకుంటామన్నారు. తెలుగు రాష్ర్టాలు బాగుండాలన్నదే తన ధ్యేయంగా కేసీఆర్ స్పష్టం చేశారు. - See more at: http://www.teluguwishesh.com/190-andhra-headlines-flash-news/55322-kcr-briefs-about-meeting-with-chandrababu-naidu.html#sthash.P2VgDRH4.dpuf